13th jan | రెమ్యూనరేషన్ తీసుకోలేదా..?

13th jan | రెమ్యూనరేషన్ తీసుకోలేదా..?

Ravi Teja | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ.. కథ నచ్చితే చాలు.. ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా..? ఫెయిల్యూర్ లో ఉన్నాడా..? అనేది ఏమాత్రం పట్టించుకోరు. అంతే కాదండోయ్.. తను నటిస్తున్న సినిమాల రిజెల్ట్(Movie results) గురించి కూడా పెద్దగా వర్రీ అవ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే.. విజయం వస్తే.. పొంగిపోవడం.. అపజయం వస్తే.. కృంగిపోవడం చేయరు. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు. ఇదిలా ఉంటే.. ఇటీవల రవితేజ ఓ సినిమాకి రెమ్యూనరేషన్(Remuneration for the film) తీసుకోలేదనే మాట బయటకు వచ్చింది. ఇంతకీ.. రవితేజ రెమ్యూనరేషన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి..? అసలు ఏం జరిగింది..?

13th jan | రవితేజ ది గ్రేట్..

13th jan

రవితేజ.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలు పోషించారు. హీరో అయిన తర్వాత కెరీర్ లో వెనుకతిరిగి చూసుకోకుండా దూసుకుంటూ వెళుతున్నారు. కొత్త టాలెంట్(New talent) ను ఎంకరేజ్ చేస్తూ.. ఎంతో మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే.. ఈమధ్య కాలంలో.. రవితేజ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతున్నాయి. రాజా ది గ్రేట్ సక్సెస్ తర్వాత రవితేజ నటించిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మలినేని గోపీచంద్ డైరెక్షన్(Directed by Malineni Gopichand) లో రవితేజ నటించిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ అందించింది.

13th jan | ఆలోచనలోపడిన రవితేజ..

క్రాక్ మూవీ(Crack movie)తో రవితేజ ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో వరుసగా మళ్లీ రెండు ఫ్లాప్స్ చూశాడు. ఆతర్వాత థమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్(block buster) సాధించాడు. ఇక నుంచైనా సక్సెస్ కంటిన్యూ చేస్తాడనుకుంటే.. మళ్లీ మామూలే. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర.. ఇలా ఏ సినిమా చేసినా.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడమే కానీ.. బాక్సాఫీస్(box office) దగ్గర మాత్రం హిట్ అనిపించుకోవడం లేదు. అందుకనే అనుకుంటా ఆలోచనలోపడిన రవితేజ.. ప్రస్తుతం చేస్తున్న విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారట. అదే.. రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేయడం.

13th jan | మంచి నిర్ణయం..

13th jan

అవును.. రవితేజ రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేశారట. ఆ సినిమానే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాని కిషోర్ తిరుమల(Kishore Tirumala) తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ అండ్ టీజర్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే రవితేజ తన రూటు మార్చి.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయడంతో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే మాట బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చూడడానికి జనాలు బాగా ఇష్డపడుతున్నారు. అందులోనూ రవితేజ కామెడీ టైమింగ్(Ravi Teja’s comedy timing) కు.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయితే.. జనాలకు విపరీతంగా నచ్చుతుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.

13th jan | ఆ ఒప్పందం ప్రకారమే..

13th jan

రవితేజ ఒక్క రూపాయి కూడా రెమ్యూరేషన్ తీసుకోలేదు అనే విషయాన్ని స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి(Producer: Sudhakar Cherukuri) బయటపెట్టారు. ఇప్పటి వరకు రవితేజకి రూపాయి రెమ్యూనిరేషన్ ఇవ్వలేదని.. లాభాల్లోనే వాటా తీసుకోవాలనే ఒప్పందంతో ఈ సినిమా చేశారని చెప్పారు. అంతేకాదు సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే చేశారట. ఎందుకంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్(elements) అన్నీ కూడా సంక్రాంతి ఆడియన్స్ కి నచ్చే అంశాలు. అందుకే.. సినిమా సైన్ చేసినప్పుడే సంక్రాంతి వస్తేనే చేస్తానని ఒప్పందం చేసుకున్నారట.

ఆ ఒప్పందం ప్రకారమే ఇంత పోటీలో కూడా సంక్రాంతి బరిలోకి ఈ మూవీ వస్తుందని తెలియచేశారు. ఏది ఏమైనా.. రెమ్యూనరేషన్ తీసుకుండా లాభాల్లో వాటా(Share in profits) తీసుకోవడం అనేది నిర్మాతకు చాలా లాభం. రవితేజ మంచి నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన హీరోలు కూడా ఇలా ఆలోచిస్తే నిర్మాతకు, ఇండస్ట్రీకు బాగుంటుంది.. జనవరి 13న(On January 13th) ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి.. రవితేజ రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసిన ఈ సినిమా అయినా సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

CLICK HERE TO READ కారు ప్రమాదంలో స్టార్ హీరో….

CLICK HERE TO READ MORE

Leave a Reply