Ranga Reddy | భ‌ర్తే కాల‌య‌ముడు…

Ranga Reddy | భ‌ర్తే కాల‌య‌ముడు…

Ranga Reddy | మంచాల, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హతమార్చాడు. కలకాలం కలిసి నడుస్తానన్న భర్తే చివరికి కాలయముడయ్యాడు. ఈ విషాదకర సంఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండల పరిధి నోముల గ్రామానికి చెందిన మదరమోని బాబు (55), అమృత, దంపతులకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు నవీన్, చిన్న కుమారుడు భరత్ ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహమై ఒక పాప ఉన్నది.

అయితే శివరాత్రి పండుగ రోజు మదరమోని బాబు ఇంటికి బంధువులు వచ్చారనీ, అదే రోజు ఇంట్లో గొడవ జరిగిందని తెలిపారు. మరుసటి రోజు నుండి తండ్రి బాబు తో కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మాట్లాడటం లేదని, అతను ఇంటి పైనే ఒక్కడే ఉండేవాడు. రోజు కిందికి వచ్చి భోజనం చేసి వెళ్లేవాడు. మంగళవారం బాబు కోడలు, తన పాపను పడుకోబెట్టడానికి ఆమె గదిలోకి వెళ్ళింది. అయితే అది గమనించిన బాబు, కోడలి గదికి బయట నుండి గొల్లం పెట్టాడు.

భార్య అమృత ఆ సమయంలో మంచంపై పడుకొని ఉండగా, బాబు గొడ్డలి తీసుకొని భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు. గొడ్డలి అదే గదిలో వదిలేసి, అక్కడి నుండి పరారయ్యాడు. పక్క గదిలో ఉన్న కోడలికి శబ్దం వినిపించడంతో తన గది తలుపును తీయడానికి ప్రయత్నిచింది. గది తలుపు తెర్చుకోపోవడంతో తన భర్త నవీన్ కి ఫోన్ చేసింది. తన భర్త నవీన్ మంగళపల్లిలో ఉన్నానని చెప్పాడంతో, కోడలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపు తెరవడంతో అమృత రక్తపు మడుగుల్లో విగత జీవిగా పడిఉంది. దీనితో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Leave a Reply