రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

  • ఎస్ఐ కృష్ణదేవ

ఊర్కొండ, ఆంధ్రప్రభ ; రోడ్డు భద్రత నియమాలని పాటించి ప్రమాదాలను అరికట్టవచ్చని ఎస్సై కృష్ణదేవ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలో వాహనదారులతో వారు మాట్లాడుతూ రోడ్డు నియమ నిబంధనలు పాటించడంతో ప్రమాదాలు జరగవని మద్యం సేవించి వాహనాలు నడపరాదని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై అంజన్ రావు, లచ్చినాయక్, హెడ్ కానిస్టేబుల్ వెంకోజి వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply