బీజేపీ నేత సురేందర్ రెడ్డికి మాతృవియోగం

బీజేపీ నేత సురేందర్ రెడ్డికి మాతృవియోగం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన బిజెపి రాష్ట్ర నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి తల్లి గుజ్జుల యాదమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు, కార్యకర్తలతో పాటు పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సోమవారం యాదమ్మ మృతదేహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.

సురేందర్ రెడ్డి తదితరులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జరిగిన అంత్యక్రియలలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply