వార్డులలో అభివృద్ధి మా లక్ష్యం

వార్డులలో అభివృద్ధి మా లక్ష్యం

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌ పట్టణంలోని మున్సిపాలిటీలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి, వైస్ చైర్ పర్సన్ సంటి లత, కౌన్సిలర్ పర్శ కుశలత,(అనంతరావు) అంజు అలీ,ఆరేపల్లి శ్రీజ (నాగేంద్రబాబు,) తోట సతీష్, సంగ్య నాయక్, రెండు ఎస్సి వాడ సంఘాల సభ్యులు, ఆధ్వర్యంలో సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, కాలనీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులలో అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందజేస్తామని తెలిపారు. విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోదిరే స్వామి, జేజే నర్సయ్య, కౌన్సిలర్ పర్శ కుశలత, (అనంతరావు) అంజు అలీ,ఆరేపల్లి శ్రీజ (నాగేంద్రబాబు,) తోట సతీష్, లను ఈ సందర్బంగా రెండు ఎస్సి వాడ సంఘాల సభ్యులు నాయకులకు పూల మాల, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెండు వార్డులకు చెందిన ఎస్సి వాడ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply