Section 144 | పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..

Section 144 | పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..
Section 144 | గూడూరు, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షలు రాష్ట్రమంతటా సోమవారం నుండి మొదలయ్యాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరులో ఇంటర్మీడియట్ పరీక్షలు ఎంతో పటిష్ట బందోబస్తు నడుమ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అప్పటికే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కేంద్రాల లోపలకి హాల్ టికెట్లు పరిశీలించి పరీక్ష రాసే విద్యార్థుల్ని అనుమతించారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచుతూ జిరాక్స్ షాపులు తదితర దుకాణాలు సైతం మూయించి వేశారు.
గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాల, రెండో పట్టణంలో రెండు కళాశాలలు, రూరల్ పరిధిలో ఒక కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరైనా ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని డిఎస్పి గీతాకుమారి హెచ్చరించారు. విద్యార్థులు పరీక్ష సమయాలకి అర గంట ముందే చేరుకోవాలని ఎండ తీవ్రత అధికంగా మొదలవుతున్న దృశ్య తాగునీరు అధికంగా తీసుకోవడంతో పాటు పరీక్షలు అనే ఒత్తిడిని కూడా తగ్గించుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆమె ఆకాంక్షించారు.
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మొదటి సంవత్సరం సోమవారం ప్రారంభమయ్యా యి. నేటి నుండి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ తో విద్యార్థులు హడావుడిగా ఉరుకులు పరుగులుగా మోట ర్ సైకిల్ పై సెంటర్లకు చేరుకోవటం విశేషం. కొందరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవటం విశేషం. పోలీసులు సకాలంలో స్పందించి ట్రాఫిక్ ను క్లియర్ చేయటంతో సకాలంలో సెంటర్ కు చేరుకోగలిగారు.
రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహి స్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 19,57,312 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న రు. ప్రతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం అదన బస్సులను ఆర్టీసీ సౌకర్యం కల్పించింది. రిక్షా కేంద్రాల్లోకి మొబైల్ లో స్మార్ట్ వాచ్ క్యాలిక్యులేటర్లు నిషేధం చేశారు. పరీక్షల కాజరియ ప్రతి విద్యార్థి గంట ముందే పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.జిల్లాలో 55 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు డిప్యూటీ తహశీల్దార్లను నియమించారు. ఇన్విజిలేటర్లు సైతం సెల్ ఫోన్ దగ్గర ఉంచుకోకూడదని నిబంధన పెట్టారు. పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించాలని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి భయంకరమైన శబ్దాలు వినిపించకూడదని ఆదేశించారు.విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో తగినంత లైటింగ్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా గదిలో గోడ గడియారం ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రహదారులకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాలను భద్రతతో పోస్టు కార్యాలయాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోస్టల్ శాఖ అధికారులను ఆదేశించారు.
