అర్జీలు వెంటనే పరిష్కరించాలి…

అర్జీలు వెంటనే పరిష్కరించాలి…

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

గంగాధర నెల్లూరు, ఆంధ్రప్రభ : ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా, మండల స్థాయిలోనే పరిష్కరించగలిగిన వాటిని ఖచ్చితంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టం – పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ వీఎం థామస్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్, డీఆర్‌ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ సురేష్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారం నాణ్యతతో పాటు వేగవంతంగా ఉండాలని స్పష్టం చేశారు.

గడువు ముగిసేలోగా ప్రతి అర్జీపై చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత అర్జీలు అధికంగా వస్తున్న నేపథ్యంలో, ఆయా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలన్నారు.

Leave a Reply