SAAP SPORTS | వావ్.. శాప్ సైక్లింగ్ః పందడి Andhra Prabha News

SAAP SPORTS | వావ్.. శాప్ సైక్లింగ్ః పందడి Andhra Prabha News
ఎన్‌టీఆర్ జిల్లా సెలెక్షన్స్‌కు విశేష స్పందన
ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో…
నున్నలో శాప్‌లీగ్ రాష్ట్రస్థాయి సైక్లింగ్ : డీఎస్‌డీఓ
(విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ )
విద్యార్థులలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి సరైన శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికారసంస్థ (శాప్) ఆధ్వర్యంలో ఏడాదిపొడవునా నిర్వహిస్తున్న శాప్ లీగ్‌లలో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి సైక్లింగ్ జిల్లా జట్ల ఎంపికలు విజయవాడ రూరల్ మండలం నున్న లోకల్ బైపాస్‌లో ఆదివారం నిర్వహించారు.

ఈ ఎంపికలకు 18 ఏళ్లలోపు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీష, పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) కాకర్ల కోటేశ్వరరావు ఈ ఎంపికలను నిర్వహించారు. నున్న లోకల్ బైపాస్‌లో నిర్వహించిన ఈ ఎంపికలను నున్న రూరల్ పోలీస్ స్టేషన్ (పాయకాపురం) ఎస్సై ఆర్ మధుశ్రీ, అజిత్‌సింగ్‌నగర్ ట్రాఫిక్ ఎస్సై జె కృష్ణ, డీఎస్‌డీఓ కాకర్ల కోటేశ్వరరావు, శాప్ సైక్లింగ్ కోచ్ కె కనకారావు, సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె సుగుణరావు జెండా ఊపి ప్రారంభించారు. టైమ్ ట్రైల్, మాస్ స్టార్ట్ విభాగాలలో బాల బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి నున్న రూరల్ ఇన్‌స్పెక్టర్ పీ కృష్ణమోహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విజేతలకు బంగారు, రజత, కాంస్య పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మోహన్ మాట్లాడుతూ, క్రీడలు చదువులో భాగమేనని, ప్రతి ఒక్కరూ ఏదోక క్రీడాంశంలో ప్రావిణ్యం సంపాదించాలన్నారు. దీనివల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందడంతపాటు క్రమశిక్షణ మెరుగుపడుతుందన్నారు. అంతేగాకుండా విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. నున్న కేంద్రంగా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు.

ఎస్సైలు భూక్యా సోని, ఆర్ మధుశ్రీ మాట్లాడుతూ, చదువుతోపాటు క్రీడలలో రాణించిన వారికి ఉన్నత విద్య, ఉద్యోగవకాశాలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటయన్నారు. ప్రభుత్వం కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీఎస్‌డీఓ కోటేశ్వరరావు మాట్లడుతూ, జిల్లాస్థాయిలో ఎంపికైన వారు ఈ నెల 28, మార్చి 1 తేదీలలో నున్న లోకల్ బైపాస్‌లో నిర్వహించే శాప్ లీగ్ రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి టీ శ్రీలతతోపాటు తదితరులు పాల్గొన్నారు. కాగా, సైక్లింగ్ పోటీల నిర్వహణ కోసం లోకల్ బైపాస్‌లో వాహనాల రాకపోకలను ట్రాఫిక్, సివిల్ పోలీసులు క్రమబద్దీకరించగా, వైద్యారోగ్యశాఖ సిబ్బంది వైద్య సేవలు అందించారు.
ఎన్టీఆర్ జిల్లా సైక్లింగ్ జట్లు
అండర్ – 18 బాలుర వ్యక్తిగత టైమ్ ట్రైల్: డీ అమర్ కుమార్; కె శివ మహేష్, ధనుష్ కుమార్, డీ ధృవ,
మాస్ స్టార్స్ :పీ యశ్వంతకుమార్, జీ సిద్ధు, హేమంత్ సాయి, కె నాగ హర్ష
బాలికల వ్యక్తిగత టైమ్ ట్రైల్ : సిమ్రాన్, పీ స్నేహలత,
మాస్ స్టార్స్ : హారిక, పీ స్నేహ
