bjp|తార్నాక‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌

bjp|తార్నాక‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌

  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్‌
  • కామారెడ్డి జిల్లాకు వెళ్లేందుకు య‌త్నం
  • అడ్డుకున్న పోలీసులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు రామచందర్‌రావు యత్నించగా.. పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన బయల్దేరడంతో అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు భాజపా కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కామారెడ్డి వెళ్లి తీరుతానని, న‌న్నెవ‌రూ ఆప‌లేర‌ని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాంచందర్ రావు, పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీజేపీ ముఖ్యనాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు.

Leave a Reply