ఇందిరమ్మకల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఇందిరమ్మకల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
ఊట్కూర్, ఆంధ్రప్రభః దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కలలుగన్న గూడు లేని పేద ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి నెరవేరుస్తున్నారని ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి.యగ్నేశ్వర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ లో మంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడంతో గృహప్రవేశాలు చేపట్టారు.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మించుకుంటే దశలవారీగా బిల్లులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరతగతిన నిర్మించి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా నిర్మాణ పనులు పూర్తిచేసిన లబ్ధిదారులు పూజారి నరసింహ నర్సమ్మ, దేవనోల లక్ష్మి శంకరప్ప ఇండ్లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మండలంలో ఇందిరమ్మ లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్,వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు అంజప్ప,రామకృష్ణ గారు, గోపాల్ గౌడ్,బీంశప్ప తదితరులు పాల్గొన్నారు.
