కరపత్రం ఆవిష్కరణ

- శివభక్త మార్కండేయ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం
- హాజరుకానున్న మంత్రి కొండ సురేఖ, మేయర్ సుధారాణి
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని 34 డివిజన్ శివనగర్‌లోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయం ద్వితీయ వార్షిక మహోత్సవం ఈ నెల 23 సోమవారం నిర్వహిస్తున్నామని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, వడ్నాల మల్లయ్య, కన్వీనర్ వడ్నాల సదానందం, ప్రధాన కార్యదర్శి బుదారపు భాస్కర్ తెలిపారు. ఈరోజు ఆదివారం ఉదయం 11 గంటలకు భక్త మార్కండేయ దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవం కరపత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ సోమవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం రక్షాబంధనం, 24న దేవత హవనము ,బలి ప్రధానం, పూర్ణాహుతి శివపార్వతుల శాంతి కళ్యాణం అనంతరం మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు. ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవానికి మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావు, మేయర్ గుండు సుధారాణి, హాజరవుతున్నారని తెలిపారు. కరపత్రం ఆవిష్కరణలో పరపతి సంఘం కోశాధికారి పాశికంటి రవికుమార్, పాశికంటి రాజేశ్వరరావు, రాపెల్లి చంద్రమౌళి, చిదురాల రాజలింగం,మిట్టపల్లి కోటేశ్వరరావు,బత్తుల సత్యం, పూజారులు ముదిగొండ అభిషేక్ శర్మ, ముక్కు కృష్ణ శర్మ, కస్తూరి శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
