AGRO SHOW | శిక్షణలో ఉట్నూర్ రైతులు..

AGRO SHOW | శిక్షణలో ఉట్నూర్ రైతులు..
AGRO SHOW, ఉట్నూర్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 3 రోజుల పాటు ఆగ్రో షో పరిజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మెలకువలు అత్యాధునిక వ్యవసాయం సాగు పై రైతు బడి అగ్రి షో శిక్షణ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రైతులు సల్గర్ రవీందర్, గడమే భూపతి పాల్గొన్నట్లు వారు తెలిపారు. ఆగ్రో కంపెనీ ఇచ్చిన అవగాహన శిక్షణకు ఆహ్వానించగా ఆగ్రో షోలో పాల్గొన్నామని తెలియచేశారు.
ఆగ్రో షో శిక్షణ కార్యక్రమంలోవ్యవసాయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకొని వ్యవసాయంలో కూలీల కొరత కొరకు డ్రోన్ తో మందులు ఎరువులు పిచికారి, ఏఐతో వ్యవసాయంలో అనేక మార్పులు వస్తాయని తెలుసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఆధునిక పంటల సాగు పై ఎంతో అవగాహన కల్పించారని ఉట్నూర్ మండలంలోని సాలెవాడ( కె ) గ్రామ రైతులు సాల్గేర్ రవీందర్, గడమే భూపతిలు తెలిపారు. ఆధునిక వ్యవసాయ సాగు విషయాల పై ఎంతో అవగాహన కల్పించారని వారు పేర్కొన్నారు.
