Training | ముగిసిన సర్పంచుల శిక్షణ

Training | ముగిసిన సర్పంచుల శిక్షణ

Training | మునుగోడు, ఆంధ్రప్రభ: ఐదు రోజులుగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణా తరగతులు జిల్లా కేంద్రంలోని డి ఆర్ డి ఏ లో విజయవంతంగా ముగిశాయి. గత ఐదు రోజుల నుండి గ్రామ పంచాయతీ పరిపాలన, అభివృద్ధి పథకాల అమలు, ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల పర్యవేక్షణ, నిధుల సక్రమ వినియోగం,గ్రామ సభల నిర్వహణ,పారదర్శకత వంటి అంశాలపై అధికారులు సర్పంచులకు సవివరంగా అవగాహన కల్పించారు.

శిక్షణ ముగింపు కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) సర్పంచులకు సర్టిఫికెట్లు అందజేశారు. గ్రామాల అభివృద్ధి కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం సర్పంచులు మాట్లాడుతూ శిక్షణ ద్వారా పరిపాలనా విధానాలపై స్పష్టత ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శిక్షకులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply