Port Capital ఇక బందరు పోర్టు రాజధాని Andhra Prabha News

Port Capital ఇక బందరు పోర్టు రాజధాని Andhra Prabha News
అమరావతితో పోర్టు అనుసంధానం పై ప్రణాళిక
మచిలీపట్నం “రాజధాని పోర్టు”గా రూపుదిద్దుకునే అవకాశం
పోర్టు అభివృద్ధితో భారీ నిధులు – వేగవంతమైన నగరాభివృద్ధి
అమరావతితో పోర్టు అనుసంధానం పై ప్రణాళిక
మచిలీపట్నం “రాజధాని పోర్టు”గా రూపుదిద్దుకునే అవకాశం
పోర్టు అభివృద్ధితో భారీ నిధులు – వేగవంతమైన నగరాభివృద్ధి
అభివృద్ధి పైనే ప్రత్యేక శ్రద్ధ
స్వచాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర
( మచిలీపట్నం, – ఆంధ్రప్రభ)

Port Capital : కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంను చారిత్రాత్మక రాజధాని పరిధిలోకి తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మచిలీపట్నంలో నిర్వహించిన “స్వచాంద్ర స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Port Capital : బందరు పోర్టు అభివృద్ధే లక్ష్యం

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… అభివృద్ధి చెందిన ప్రధాన రాజధానులు పోర్టులతో అనుసంధానమై ఉన్నాయన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బందరు పోర్టును రాజధాని అమరావతితో అనుసంధానం చేసి, సీఆర్‌జెడ్ పరిధిలోకి తీసుకువస్తే మచిలీపట్నం “రాజధాని పోర్టు”గా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పోర్టు అభివృద్ధి ద్వారా భారీ నిధులు సమకూరి, మచిలీపట్నం నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

also read : Minister kollu కల్తీ మద్యంతో దోచేశారు AndhraPrabha assembly news
