బస్సు సౌకర్యం కల్పించాలని వినతి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య కు బీజేపీ నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పెద్దపోర్ల గ్రామం నుండి ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రతిరోజు సుమారు 70 నుంచి 80 మంది విద్యార్థులు వివిధ పనుల నిమిత్తం గ్రామస్తులు నారాయణపేట, మక్తల్ పట్టణాలకు వెళుతుంటారని పేర్కొన్నారు. పెద్దపోర్ల గ్రామానికి ఇంతవరకు బస్సు సౌకర్యం లేక దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు కాళీ కాలినడకన కొల్లూరు గేటు వద్దకు విద్యార్థులు ఉదయం, సాయంత్రం నడుచుకుంటూ వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఇక్కట్లు దృష్టిలో పెట్టుకొని తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని డీఎం లావణ్య హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోయిన్ పల్లి నరేష్ కుమార్, బి వెంకటయ్య, సంటి రాము, నాగేష్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply