కఠిన చర్యలు తప్పవు..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల వ్యాప్తంగా గ్రామాలలో బెల్ట్ షాపులు, నాటు సారా విక్రయాలను నిర్వహించిన బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ కు ఆటంకం కలిగించిన, ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన, అసభ్య పదజాలం వాడిన, శాంతి భద్రతలకు విగాతం కలిగించిన చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని గట్టుప్పల ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. బెల్ట్ షాప్ లు నిర్వహించిన మరియు నాటు సారా తయారీ మరియు ప్రోత్సహించిన తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రూ.5లక్షల రూపాయలకు బైండోవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని, ఒకరు పట్ల ఒకరు సోదర భావం కలిగి ఉండి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలని సూచించారు.
