Forest department | పర్యాటకుల కోసం సఫారీ..

Forest department | పర్యాటకుల కోసం సఫారీ..

Forest department, వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రకృతి రమణీయత మధ్య ఎత్తైన గుట్టల్లో పచ్చదనం పరిమళించే అనంతగిరి ప్రాంతానికి రోజురోజుకు పెరుగుతున్న పర్యాటకులు నేపథ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వారు సంచరించే విధంగా సఫారీ వాహనాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతగిరి అటవీ ప్రాంతం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపొందనుంది. ఇప్పటికే నందిగాటు వద్ద అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని.. చెకింగ్ తదితర అంశాలతో పాటు పర్యాటకుల కోసం పది కిలోమీటర్లు ప్రయాణించే విధంగా సఫారీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యాటకులకు నామమాత్రపు చార్జీలు వసూలు చేసి ఈ సఫారీ వాహనంలో తిరిగేలా అవకాశం కల్పిస్తున్నట్టు డి ఎఫ్ ఓ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

Leave a Reply