జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపిన దివిసీమ విద్యార్థి డొక్కా జ్ఞానేశ్వర్

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపిన దివిసీమ విద్యార్థి డొక్కా జ్ఞానేశ్వర్

డొక్కా జ్ఞానేశ్వర్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అభినందన

మచిలీపట్నం – ఆంధ్రప్రభః కోడూరు మండలం,లింగారెడ్డి పాలెం శివారు, పెదగుడుమోటు కు చెందిన కీర్తిశేషులు డొక్కా జ్ఞాన ప్రకాశరావు (హెడ్ మాస్టర్ సిబిసీఎన్సీ స్కూల్ పెద్ద గూడుమోటు) మనమడు డొక్కు జ్ఞానేశ్వర్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జయంత్ సాయి 99.49 పర్సంటేజ్ సాధించి దివిసీమ కీర్తిని చాటారు.

సమగ్ర శిక్ష కృష్ణాజిల్లా కార్యాలయం మచిలీపట్నం నందు సీనియర్ అసిస్టెంట్ గా పని చేయుచున్న డొక్కా రాజేంద్ర ప్రసాద్, డొక్కు స్రవంతి ల కుమారుడైన జ్ఞానేశ్వర్ తన విద్యా ప్రస్థానాన్ని విజయవాడ లోని కేంద్రియ విద్యాలయం లో ప్రారంభించి 10 తరగతి తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. అనంతరం ఉన్నత విద్య కోసం శారదా కాలేజీ మొగల్ రాజపురం విజయవాడ నందు చేరి తన చదువును కొనసాగించారు. మొదటి నుండి చదువులో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న జ్ఞానేశ్వర్ జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ పర్శంటేజ్ సాధించడంతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కలెక్టర్ డీకే.బాలాజీ కలెక్టర్ వారి కార్యాలయంలో విద్యార్థిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర్ గారు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష ఆర్.కుముదని సింగ్ పాల్గొన్నారు. భవిష్యత్తులో ఐఐటీలో సీటు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply