చిట్యాలలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

చిట్యాలలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ: చత్రపతి శివాజీ ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలనిఆరె సంక్షేమ సంఘం చిట్యాల మండల కమిటీ అధ్యక్షుడు లాండే సాంబశివరావు, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ లు అన్నారు. మండలంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఆరె సంక్షేమ సంఘం చిట్యాల మండల కమిటీ, బిజెపి చిట్యాల మండలకమిటీ , ఆధ్వర్యంలో వేరువేరుగా శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, సాంబశివరావు లు మాట్లాడుతూ హిందూ స్వరాజ్య స్థాపన కోసం పోరాటాలు చేసి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప మహనీయుడని, మొగలుల తలలు వంచి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారని ఆయన చేసిన పరిపాలన అన్ని వర్గాల వారికి సమన్వయంగా ఉంటూ దేశ సంస్కృతిని కాపాడడంలో ముందుండేవారని, ప్రతి ఒక్క భారతీయుడు చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలన వారు కోరారు .


ఈ కార్యక్రమంలో ఆరే సంక్షేమ సంఘం మండల నాయకులు, కుసుంబ సాంబయ్య, తోర్నరాజు రంపిసరాజు లాండ్ శివాజీ డాక్టర్ ప్రశాంత్, బిజెపి జిల్లా మండల నాయకులు మైదం శ్రీకాంత్, మందల మొగిలి, నల్ల శ్రీనివాస్ రెడ్డి ,వల్లాల ప్రవీణ్, కెంసారపు ప్రభాకర్, రాజకుమార్ , గొర్రె అనిల్ వెంకటేశ్వర్లు, కదం రాజు, అశోక్ చారి, రాయిని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply