రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపిక
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ గ్రామానికి చెందిన యువకుడు జి.భరత్ ఈనెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు నారాయణపేట జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని అమీర్ నగర్ కబడ్డి టీం కోచ్ బెరిగిడి శ్రీనివాస్ తెలిపారు. భరత్ ఎంపిక కావడం పట్ల ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ రవీందర్ నాయక్, గ్రామ సర్పంచ్ నీలవేణి దశరత్,గ్రామ వీడిసి సభ్యులు,కబడ్డీ సీనియర్ ప్లేయర్స్ రాజేందేర్,గుర్రం నరేష్,నర్సింలు,గణేష్,రంజిత్ లు హర్షం వ్యక్తం చేసారు.గ్రామానికి పేరు తెస్తున్నందుకు అభినందిస్తూ ఇంకా ఎంతో మంది క్రీడాకారులు మన గ్రామం నుండి పై స్థాయి కి ఎదగాలని ఆకాంక్షించారు.
