Home | రేపో మాపో రైతు భరోసా..!

Home | రేపో మాపో రైతు భరోసా..!

ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు కాంగ్రెస్ ఘనతే
నాడు ఇందిరమ్మ, రాజశేఖర్ రెడ్డి హయాంలో..
నేడు సీఎం రేవంత్ హయాంలోనే ఇండ్లు
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

Home | మోత్కూర్, ఆంధ్రప్రభః సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలనలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమయ్యాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. మండలంలోని దత్తప్పగూడెం లో లబ్ధిదారురాలు గనగాని సువర్ణ సాయిలు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం లో ఎమ్మెల్యే సామెల్ పాల్గొని నూతన ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ నాడు ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదలకు ఇండ్లు మంజూరు కాగా,నేడు మళ్లీ సిఎం రేవంత్ హయాంలో పేదలకు ఇండ్లు నిర్మిస్తున్నామని ఇది ప్రజా ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘనతేనన్నారు.

గత బి ఆర్ ఎస్ 10 ఏండ్లలో బొందల గడ్డలు,స్మశాన వాటికలు నిర్మించారని ఎద్దేవా చేశారు. మోత్కూర్ మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ కి గొప్ప విజయాన్ని అందించిన మోత్కూర్ మున్సిపల్ ప్రజలకు,దత్తప్పగూడెం లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టిన గ్రామ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. రేపో మాపో రైతు భరోసా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.కాంగ్రెస్ హయాంలో సన్న బియ్యం, ఉచిత బస్సు మహిళలకు,ఉచిత కరెంటు, రైతు భరోసా,రైతులకు సబ్సిడీ పై వ్యవసాయ పనిముట్లు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.దత్తప్పగూడెం లో కత్వ సమస్యల పరిష్కారానికి తాను ఇరిగేషన్ డి ఈ తో మాట్లాడానని,డి ఈ వచ్చి ప్రతిపాదనలు తయారు చేసి పంపిస్తే ఇరిగేషన్ శాఖ నుండి నిధులు మంజూరు చేయించి సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే స్వయంగా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుండు యాదగిరి గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య,ఏ పి ఐ డి సి మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరి రెడ్డి,సింగిల్ విండో మాజీ చైర్మన్ పి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ ఇటికాల ఎల్లమ్మ, కౌన్సిలర్లు గనగాని శైలజ,కుర్మిళ్ల ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply