students | విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి…

students | విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి…
ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి
జుక్కల్ ప్రభుత్వ కళాశాలలో వీడ్కోలు సమావేశం
అలరించిన విద్యార్థుల నృత్యాలు
students | జుక్కల్,ఆంధ్రప్రభః విద్యాబోధనలో విద్యార్థిని, విద్యార్థులు అత్యున్నతమైన మార్కులు సాధించి,ఇంకాముందు విద్యా బోధన కొనసాగిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి,జిల్లా జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ అన్నారు. జుక్కల్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సర విద్యార్థులకు బుదువారం వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈసమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఎంసీ చైర్మన్ కే.సాయగౌడ్, మాజీ సర్పంచులు బొంపల్లి రాములు,సురేష్ గొండ పాల్గొన్నారు.ఈసందర్భంగా పై వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతగా చదివి మంచిర్యాంకులు సాధించడమే కాకుండా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలన్నారు.
ముఖ్యంగా పరీక్ష సమయంలో సెల్ ఫోన్లులకు దూరంగా ఉంటూ, ఇష్టంగా మనస్సుపెట్టి చదివి ఉత్తీర్ణత సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతితులు మాట్లాడుతూ జూనియర్ కళాశాల మౌలిక వసతులకోసం తమవంతు కృషి చేయడం జరుగుతుందని,ప్రహరీగోడ నిర్మాణం కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు దృష్టికి తీసుకెళ్లటం జరుగుతుందని, ఇంటర్ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన వారికి నగదు రూపంలో పారితోషకం అందించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధన పొంది ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం జరిగిందని,ప్రభుత్వ పాఠశాలలో చదవటం చిన్న చూపుగా భావించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుండి పేజీ వరకు అందిస్తున్న ఉచిత విద్య బోధనను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.ఈ కార్యక్రమంలో మాజీ విండో చైర్మన్ నగల్గిద్దే శివానంద్, జుక్కల్ మరియు బస్వాపూర్ ఉపసర్పంచులు షేక్ ఫీర్దోస్,అనిల్ తో పాటు మద్నూర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పాండురంగ్,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మాధవి,అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


