Awareness | పీఎం విశ్వకర్మ పై అవగాహన సదస్సు

Awareness | పీఎం విశ్వకర్మ పై అవగాహన సదస్సు
Awareness | మోత్కూర్, ఆంధ్రప్రభః ర్యాంపు ప్రాజెక్ట్ లో భాగంగా మోత్కూర్ మండలంలోనీ మహిళ సమాఖ్య కార్యాలయంలో జిల్లా ఈడీసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పీ.ఎం విశ్వకర్మ పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు . ఈ సందర్భంగా దాదాపు 35 మందికి సంప్రదాయ వృత్తిదారులు, శిల్పులు మరియు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలకు పథకం ప్రయోజనాలు, రుణ సదుపాయాలు, శిక్షణ, టూల్ కిట్ సహాయం , వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ట్రైనర్ అశోక్ కూలకషంగా వివరించారు.
బ్యాంకులు వాటి పరిమితులు విధి విధానాలు, లోన్ల మంజూరు , వాటి షరతులు తదితర అంశాలను ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్ , తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ లు వివరించారు.ర్యాంపు కార్యక్రమం ద్వారా ఏంఏస్ఏంఈ ల పనితీరును మెరుగుపరచడం, నైపుణ్య అభివృద్ధి, ఆర్థిక సహాయం, టూల్కిట్ ప్రోత్సాహకాలు, డిజిటల్ , మార్కెటింగ్ మద్దతు కల్పించడం, సామర్థ్య వృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం పట్ల అవగాహన కల్పించడంతో పాటు, లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ సెమినారు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ మహేష్ ,లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
