Ayesha Meera | సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Ayesha Meera | సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Ayesha Meera | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆయేషా మీరా కేసులో, ఆమె తల్లిదండ్రులు సీబీఐ నివేదికపై తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తాము 19 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాం, కానీ ఇప్పటికీ న్యాయం జరగడం లేదన్నారు. కేసును స్వయంగా విచారణ జరిపించుకుంటారా అని న్యాయమూర్తి అడగ్గా.. తమ వద్ద డబ్బులు లేవని వారు తెలిపారు.

సీబీఐ దర్యాప్తు సరిగా జరగలేదని, సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.

Leave a Reply