Special status | కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ…

Special status | కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ…
కేంద్రంలో అధికారంలోకి వస్తే వెంటనే స్పెషల్ స్టేటస్..
నంద్యాలలో షర్మిల పరిరక్షణ యాత్ర…
మోదీ, బాబు కలిసి ఉపాధిని నిర్వీర్యం చేస్తున్నారు…
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
Special status | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభః స్వాతంత్ర ఉద్యమంలో నుంచి పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీనె అని కేంద్రంలోకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే పారిశ్రామికంగానూ ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తాయి అని ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి పేర్కొన్నరు. బుధవారం నంద్యాల జిల్లాలో పర్యటించారుmఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కానాలపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కలిసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు.రాష్ట్ర వాటా ఇవ్వలేని వారు 40 శాతం ఎలా ఇస్తారు?.. అంటూ ప్రశ్నించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వాటా 10 శాతం కేటాయింపులకుగాను గతేడాది రూ.800 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.450 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగతావి పెండింగ్‌లో ఉంచారని షర్మిల విమర్శించారు. 800 కోట్ల రూపాయలు ఇవ్వలేని ప్రభుత్వం, ఇప్పుడు 40 శాతం వాటా కింద పడే రూ.5 వేల కోట్ల రూపాయలు ను ఎక్కడి నుంచి తెస్తుంది?” అని ప్రశ్నించారు.
Special status | ఉపాధి హామీ ఉద్యోగ కార్డుల తొలగింపు…
రాష్ట్రంలోని పల్లె సీమల్లో ఉపాధి సంక్షోభం తలెత్తిందన్నారు. రాష్ట్రంలో గతంలో 1.10 కోట్ల ఉపాధి హామీ ఉద్యోగ కార్డులు ఉండేవని, దాదాపు రెండున్నర కోట్ల మంది ఉపాధి ద్వారా లబ్ధి పొందారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉపాధి పనులు గ్రామాల్లో పండుగలా జరిగేవన్నారు.గత ఏడాది కాలంలో 18.5 లక్షల ఉద్యోగ కార్డులు తొలగించారని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తూ కొత్త గ్రామీణాభివృద్ధి చట్టం పేరుతో మార్పులు తెచ్చారని విమర్శించారు. పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించారని ఆరోపించారు.
గ్రామసభల నిర్ణయాధికారాన్ని తీసేసి కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టారన్నారు.ఇది గ్రామీణాభివృద్ధి వినాశనానికి దారి తీస్తుందన్నారు.మాజీ సీ ఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లు కలిసి రాష్ట్రాన్ని రూ.11 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న పోరాటం ఉపాధి హామీ పరిరక్షణ కోసం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ జరిగే వరకు ఈ పోరాటం ఆగదు అని షర్మిల స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : End | శ్రీశైలం పుణ్యం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ముగింపు..
