CRIME | సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య…

CRIME | సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య…
CRIME | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురంలో జరిగింది. గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సునీతను తన మాజీ భర్త మహేశ్ హత్య చేశాడు. సునీత ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ బాటిల్ తో వెళ్లిన మహేశ్.. ఆమెను కత్తులతో పొడిచాడు.
అనంతరం పూల కుండీతో తలపై కొట్టి హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
