దిగి వస్తున్నబంగారం, వెండి ధరలు

దిగి వస్తున్నబంగారం, వెండి ధరలు

ముంబై : కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో తరచుగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల విషయంలో మారుతున్న సమీ కరణాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రభావం, డాలర్ ఇండెక్స్ బలప డుతుండటం వంటి కారణాల వల్ల రేట్లు తరచుగా మారుతున్నాయి. ఇటీవల అమెరికాతో రష్యా డాలర్లలోనే వాణిజ్యం జరుపుతుందన్న వార్తలతో బంగారం రేట్లు పడిపోయాయి. వారాలు గడుస్తున్నా దీనిపై రష్యా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మళ్లీ బంగారం ధరలు పుంజుకున్నాయి.

తాజాగా డాలర్ బలపడుతుండటంతో మళ్లీ వీటి ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 129.80 డాలర్లు (2.57 శాతం) తగ్గి 4,916.50 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 3.82 డాలర్లు (4.90 శాతం) తగ్గి 74.15 డాలర్లుగా ఉన్నాయి. ఎంసీఎక్స్లో బంగారం ధర 1.84 శాతం తగ్గి 1,51,907 రూపాయలు, వెండి ధర 3.91 శాతం తగ్గి 2,30,502 రూపాయలుగా ఉన్నాయి. హైదరా బాద్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 2,990 రూపా యలు తగ్గి 1,52,200 రూపాయలు, 22 క్యారట్ల బంగారం ధర 1,39,517 రూపా యలు, వెండి కిలో ధర 9740 రూపాయలు తగ్గి 2,31,460 రూపాయలుగా ఉన్నాయి.

మిగతా వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply