Festivals | ఘనంగా శ్రీభవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Festivals | ఘనంగా శ్రీభవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
Festivals | మర్రిగూడ,ఆంధ్రప్రభ: మర్రిగూడలో జరుగుతున్న శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవ కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకు వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని, పూజలు చేసి, స్వామి వారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేష్ గౌడ్, మాజీ బాలల హక్కుల కమిషన్ సభ్యులు పోనుగోటి అంజన్ రావు, మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ పోనుగోటి విజయరామారావు, గ్రామ ఉప సర్పంచ్ మహేశ్వరం రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాల్ మార్కెట్ కమిటీ మాజి చైర్మన్లు పాల్వాయి అనిల్ రెడ్డి, దంటు జగన్, యరగండ్లపల్లి సర్పంచ్ వల్లoల సంతోష్ యాదవ్, అజిలాపూరo సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి, సరంపేట సర్పంచ్ నక్క రాములమ్మ-రవి, గ్రామ పెద్దలు, పిట్టల శ్రీనివాస్, బచ్చు రామకృష్ణ, చెరుకు శ్రీరామ్ గౌడ్, కొలుకులపల్లి యాదయ్య, రాపోలు యాదగిరి, పగడల లింగయ్య, లక్ష్మీపతి గౌడ్, శంకర్ యాదవ్, స్వామి గౌడ్, భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.
