జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థికి సన్మానం..
జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థికి సన్మానం..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామ ఎంపీపీఎస్ పాఠశాలకు చెందిన చెరుకు వేదావ్యాస్ అనే మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి జిల్లా స్థాయికి ఎంపికైన సందర్బంగా అదే గ్రామానికి చెందిన నేరెళ్ల ఓం నారాయణ గౌడ్ శాలువాతో విద్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
