Kadam | జాతీయస్థాయి పోటీలలో గోల్డ్ మెడల్..

Kadam | కడెం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎస్ వి ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 7, 8, 9 తేదీలలో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో గల తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్ బ్లెస్సినా ఉత్తమ ప్రతిభ కనబరచి బంగారు పతకం సాధించడం జరిగిందని గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల పీఈటీ దుర్గం సునితలు తెలిపారు. ఈ సందర్భంగా బంగారు పతకం సాధించిన బ్లేస్సి న కు ప్రిన్సిపాల్ శకుంతల నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి స్పందన గంగన్న ఉప సర్పంచ్ జాడి లక్ష్మీ ఆనంద్ జిపి వార్డు సభ్యులు పిఈటి సునీత పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు అధ్యాపకులు పోషకులు అభినందించారు.
