ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా దొడ్డ కిరణ్ మిత్ర

ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా దొడ్డ కిరణ్ మిత్ర
- వైస్ చైర్మన్గా పెండ్యాల రాజు
ఇల్లెందు, ఆంద్రప్రభ ; ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య తో వార్డు సభ్యులు ప్రదర్శనగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక అధికారి మధు వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ వైస్ చైర్మన్ ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా 2 వార్డు నుండి గెలుపొందిన దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ గా 17వ వార్డు నుండి గెలుపొందిన పెండ్యాల రాజు లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లకు పట్టణప్రముఖులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

