cm revanth| సమావేశాలు.. పర్యటనలు

cm revanth| సమావేశాలు.. పర్యటనలు
- ఇవాళ సెక్రటేరియట్‌లో మున్సిపల్ శాఖపై సమీక్ష
- అనంతరం ముంబై పయనం
- రేపు హస్తినకు వెళ్లనున్న రేవంత్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అధికంగా చైర్మన్ పీఠాలు కైవసం చేసుకొని మంచి జోష్ మీద ఉంది. సీఎం రేవంత్ కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ బిజీబిజీగా ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం2 గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం మున్సిపల్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. సచివాలయంలో కీలక సమీక్ష ముగిసిన అనంతరం ఆయన ముంబై వెళ్లనున్నారు. మరుసటి రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
సచివాలయంలో సమీక్ష ముగిసిన తర్వాత అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి పయనమవుతారు. రాత్రికి ఆయన ముంబైలోనే బస చేస్తారు. రేపు ముంబైలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘క్లైమేట్ వీక్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధిపై ఈ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే, రేపు సాయంత్రం ముంబై నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
