గంగానమ్మ ఆలయ 13వ పునః ప్రతిష్ఠా మహోత్సవాలు..

గంగానమ్మ ఆలయ 13వ పునః ప్రతిష్ఠా మహోత్సవాలు

  • 27న మహచండీ యాగం

కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు గ్రామంలో కొలువై కొలిచిన వారికి కొంగుబంగారమై విరాజిల్లుతున్న శ్రీగంగానమ్మ అమ్మవారి ఆలయ 13వ పునః ప్రతిష్టా మహోత్సవాలు ఈనెల 26, 27 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మెన్ కోట యగంధరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 ఉదయం అమ్మవారి మూల విరాట్ కి విశేష అభిషేకం, 9గంటలకు కుంకుమ పూజ. సాయంత్రం 6 గంటలకు పుష్పపూజ, 7గంటలకు, చండీహోవమునకు సంకల్పము, గణపతిపూజ,ఆఖండస్థాపన,మండపారాధన, దీక్షాధారణ జరుతుందన్నారు. 27న ఉదయం 8గంటలకు మహచండీయాగం,11గంటలకు పూర్ణాహుతి, అనంతరం మహ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply