Mothkur l మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్నకు సన్మానం..

Mothkur l మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్నకు సన్మానం..

Mothkur, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పల్లెర్ల వెంకన్నను మంగళవారం శ్రీ సీతారాముల అభయ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 1 వ వార్డు నుండి పోటీ చేసి కౌన్సిలర్ గా గెలుపొంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పల్లెర్ల వెంకన్న ఎన్నిక కావడం పట్ల పురోహితులు ఫారునంది సూరిబాబు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు దంతూరి కృష్ణ, పోచం కన్నయ్య, బందారపు శేఖర్, పుల్కరం వేణు, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, బాలకృష్ణ, సోమిరెడ్డి, దండ్ల కళ్యాణ్, గోపి ,శేఖర్, శోభన్, ఫకీరు, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply