Minister | రాజకీయ చతురత………

Minister | రాజకీయ చతురత………

  • మక్తల్ నియోజకవర్గం లోని 3 మున్సిపాలిటీలు హస్త గతం

Minister | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చక్రం తిప్పి ఆధిపత్యం ప్రదర్శించారు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు హస్తగతం అయ్యాయి. ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో మక్తల్, ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లభించినప్పటికీ అమరచింతలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ దక్కలేదు . అయినప్పటికీ రాజకీయ చతురత ప్రదర్శించి సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అమరచింత మున్సిపాలిటీనీ సహితం కాంగ్రెస్ వశం చేసుకోవడంలో మంత్రి సఫలీకృతం అయ్యారని చెప్పవచ్చు.

మక్తల్, ఆత్మకూరు, అమరచింత మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు గా కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికయ్యారు. మక్తల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, వైస్ చైర్ పర్సన్ గా శైవీ రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆత్మకూరు చైర్ పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ గా నల్లగొండ శ్రీనివాసులు ,అమరచింత చైర్ పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్ పర్సన్ రాధా అరుణ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, కౌన్సిలర్లకు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply