winner | నర్సంపేట చైర్ పర్సన్ లక్ష్మీ రామానంద్, వైస్ చైర్ పర్సన్ నరేందర్ గుప్తా

winner | నర్సంపేట చైర్ పర్సన్ లక్ష్మీ రామానంద్, వైస్ చైర్ పర్సన్ నరేందర్ గుప్తా

అట్టహాసంగా మున్సిపల్ ప్రమాణస్వీకారోత్సవం…
నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండెం శ్రీలక్ష్మి రామానంద్ ఏకగ్రీవ ఎన్నిక.
వైస్ చైర్ పర్సన్ గా గంధం నరేందర్ గుప్తా

winner | నర్సంపేట , ఆంధ్రప్రభః వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమాలి ప్రకారం ముందుగా కౌన్సిలర్లుగా ఎన్నికైన 30 మంది చేత ఎన్నికల ప్రత్యేక అధికారి ఉమారాణి ప్రమాణ స్వీకారం చేయించారు. నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గా 25 అవార్డు కౌన్సిలర్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ ను 30 వార్డు కౌన్సిలర్ మాదాసి రవి ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత రెడ్డి బలపరిచారు. దీంతో శ్రీలక్ష్మి రామానంద్ చైర్పర్సన్ గా ఎన్నికైనట్లు అధికారి ప్రకటించారు. దీంతో శ్రీలక్ష్మి చైర్పర్సన్ గా ప్రమాణస్వీకారం చేశారు.


వైస్ చైర్పర్సన్ గా 7వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన గంధం నరేందర్ గుప్తా ను 24వ వార్డు కౌన్సిలర్ బత్తిని రాజేందర్ బలపరచగా 6వ వార్డ్ కౌన్సిలర్ పొన్నం నరసింహారెడ్డి బలపరచడంతో వైస్ చైర్పర్సన్ గా గంధం నరేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు .ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సలర్లు పాల్గొన్నారు.

Leave a Reply