పాలక వర్గం ప్రమాణ స్వీకారం..

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మున్సిపల్ పాలక వర్గం ప్రమాణ స్వీకారం కొరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని 12 వార్డు స్థానాల్లో 8 వార్డు స్థానాలను దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ పాలక వర్గం ఏర్పాటు కొరకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికైన అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు హైదరాబాద్ లోని ప్రైవేట్ రిసార్ట్ లో ఉన్నారు. 16 న ఉదయం 11 గంటలకు నిర్వహించే ప్రమాణ స్వీకారం తో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ఉంటుంది.ఈ కార్యక్రమానికి ఎన్నికల ప్రెసిడింగ్ అధికారిగా జిల్లా పరిషత్ సీఈఓ సాయగౌడ్ వ్యవహారిస్తారు. 16న ఉదయం 11 గంటలకు పాలక వర్గం ప్రమాణ స్వీకారం సందర్బంగా సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply