వేలాల జాతరలో విషాదం..

జైపూర్, ఆంధ్రప్రభ : మహా శివరాత్రి పర్వదినాన వేలాల వేలాల జాతరలో విషాదం చోటుచేసుకుంది.జైపూర్ మండలంలో మూడురోజుల పాటు జరిగే వేలాల జాతరకు వచ్చిన నస్పూర్ కు చెందిన బింగి రాజేందర్ (45) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో గట్టు మల్లన్న స్వామిని దర్శించుకు నేందుకు గుట్టపైకి వెళ్లే క్రమంలో గుండె నొప్పితో కింద పడిపోయాడు.అందుబాటులో ఉన్న వైద్యులు చికిత్స అందించిన ఫలితం లేకపోయిందని అప్పటికే రాజేందర్ చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు.శివరాత్రి పూట గట్టు మల్లన్న గుట్టపై విషాదఛాయలు అలుముకున్నాయి.
