student | డీఎస్పీ ఉదారత…

student | డీఎస్పీ ఉదారత…

student | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండలం, నడింపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో పదవ తరగతి విద్యార్థినుల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ హాజరయ్యారు. రాబోయే వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.

చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, క్రమశిక్షణతో లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ తన స్వంత ఖర్చుతో పదవ తరగతి విద్యార్థినులందరికీ ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నులను పంపిణీ చేశారు. డీఎస్పీ ఉదారతకు విద్యార్థినులు కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నడింపల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ బోయపల్లి కార్తీక్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply