project | 22న జిల్లాకు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి

project | 22న జిల్లాకు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి

  • నారా కోడూరులో ప్రారంభించనున్న సమృద్ధి కేంద్రం

project | గుంటూరు, ఆంధ్రప్రభ : కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ నెల 22న జిల్లాకు రానున్నారని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా చెబ్రోలు మండలంలోని నారా కొడూరులో పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ సెంటర్ (సమృద్ధి కేంద్రం) ను ప్రారంభించనున్నారని చెప్పారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మూడు ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కాగా, మిగిలినవి మధ్యప్రదేశ్‌లోని ఆరి, ఉమ్రీ గ్రామాల్లో, ఉత్తరప్రదేశ్‌లోని చౌరవాలాలో మంజూరయ్యాయన్నారు.

భారత్‌నెట్ మౌలిక సదుపాయాలను వినియోగిస్తూ గ్రామీణ భారతాన్ని భౌతిక, డిజిటల్ సేవల సమన్వయంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఈ సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భారత్‌నెట్ కనెక్టివిటీ ద్వారా అవసరమైన సేవలను సులభంగా, స్థిరంగా అందించడంతో గ్రామీణ ప్రజలు డిజిటల్ పరివర్తన ప్రయోజనాలను పొందేలా చేయడం ప్రాజెక్టు ఉద్దేశ్యం అన్నారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఈ-కామర్స్ వంటి పౌర సేవలను ఒకే కేంద్రంలో అందించడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply