ఘనంగా ఆంగ్లభాషా దినోత్సవ వేడుకలు..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆంగ్లభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఆంగ్ల భాష నైపుణ్యంలో వ్యాసరచన పోటీలు , ఉపన్యాస, స్టోరీ టెల్లింగ్, స్పెల్లింగ్ బి, ఒలంపియాడ్ తదితర. పోటీ నిర్వహించారు. ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని చాటే విధంగా విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. అనంతరం ఆంగ్ల ఉపాధ్యాయులు వెంకటమల్లు, వీణ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply