ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు

ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు

  • అడిగేలోపే అమలు – ఇదే నిజమైన ప్రజా నాయకత్వం
  • స్పందించిన సర్పంచ్ యుద్ధ ప్రాతిపదికన సూచిక బోర్డులు ఏర్పాటు
  • 24గంటల్లో పని పూర్తి చేసిన సర్పంచ్ నరసింహ
  • ప్రశంసించిన గ్రామస్తులు బాటసారులు

మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి సమీపంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేయగానే, ప్రజల మనసు పలుకరించిన సర్పంచ్ లపంగి నరసింహ తన నాయకత్వ శక్తిని మరోసారి నిరూపించారు. సమస్య తన దృష్టికి వచ్చిన క్షణం నుంచే అలసట లేకుండా కదిలి, హామీ ఇచ్చి కేవలం 24గంటల్లోనే ప్రమాదకర ప్రాంతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించి కార్యదీక్ష చూపించారు. మాటలకే పరిమితం కాని చేతల్లో చూపించే నాయకుడు అనే పేరును సార్థకం చేస్తూ ప్రజల ప్రాణ భద్రతే తన రాజకీయ ధ్యేయమని స్పష్టం చేశారు.

ప్రమాదాలు జరుగుతున్నాయనే సమాచారాన్ని గంభీరంగా తీసుకుని వెంటనే స్పందించడం ఆయన ప్రజా సేవా తపనకు నిదర్శనం. ప్రజా సమస్యలపై క్షణాల్లో స్పందించి, పరిష్కారాన్ని నేలమీద చూపించే నాయకత్వం ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. సర్పంచ్ లపంగి నరసింహ చొరవతో రాంరెడ్డిపల్లి గ్రామంలో భద్రతా చర్యలకు కొత్త దిశ లభించిందని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాముల యాదయ్య, వార్డు సభ్యులు పగిల్ల యాదమ్మ, శంకర్, యాదసి నరసింహ, పాముల నర్సింహా పాలుగోన్నారు.

Leave a Reply