congress | మక్తల్ లో తొలి ఫలితం విడుదల

13వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి మక్తల్ సరిత గోవిందరావు గెలుపు
మక్తల్ , ఫిబ్రవరి 13 ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో తొలి ఫలితం విడుదలైంది .మొత్తం 16 వార్డులకు గాను 6వ వార్డు బిజెపి అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్యతో అవార్డు ఎన్నిక రద్దయింది .15 వార్డులకు ఎన్నికలు జరగా తొలి రౌండుల ఎనిమిది వార్డుల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. 13వ వార్డు నుండి బిజెపి అభ్యర్థి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బాల్చేడ్ పావని మల్లికార్జున్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మక్తల్ సరిత గోవిందరావు 34 ఓట్ల మెజారిటీ తో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 666 ఓట్లు పోలవగి విజేత సరిత గోవింద్ రావుకు 348 ఓట్లు లబించాయి.బిజెపి అభ్యర్థి పావని మల్లికార్జున్ కు 314 ఓట్లు.వచ్చాయి. నోటొకు 2,చెల్లనివి 2 ఓట్లు పడ్డాయి.దీంతో మక్తల్ లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు
