Pamphlets |బుగ్గ రాజేశ్వర స్వామి కళ్యాణోత్సవ కరపత్రాల ఆవిష్కరణ..

Pamphlets |బుగ్గ రాజేశ్వర స్వామి కళ్యాణోత్సవ కరపత్రాల ఆవిష్కరణ..


Pamphlets | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: మహాశివరాత్రి సందర్భంగా బెల్లంపల్లిలోని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించనున్న స్వామివారి దర్శనం, కళ్యాణోత్సవానికి సంబంధించిన కరపత్రాలను గురువారం బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లంపల్లి పెద్ద బుగ్గ జాతరకు అపారమైన చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టత ఉందని తెలిపారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈసారి జరిగే స్వామివారి కళ్యాణోత్సవం, దర్శన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృప పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు కోరల పుష్ప, మంద ఉదయ్ వికాస్, పెద్ది రాజేందర్, చిలువేరు అరవింద్, మీస రమేష్, సుంకరి రాజేష్‌లతో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply