Bhupalpalli | కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె..

Bhupalpalli | కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె..
- రోడ్డెక్కిన కార్మిక సంఘాలు..
Bhupalpalli | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు సంయుక్తంగా గురువారం సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా భూపాలపల్లి లో సమ్మె కొనసాగుతోంది.. ముఖ్యంగా సింగరేణి కార్మికులు విధులకు హాజరుకాక పోవడంతో ఏరియాలోని బొగ్గు గనులు మొత్తం నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర కార్మికులు తప్ప బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన కార్మికులు ఎవరు హాజరు లేదు..
రోడ్డెక్కిన కార్మిక, అసంఘటితరంగ కార్మికులు..

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికులతో కలిసి రోడ్డెక్కారు.. ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండాలు పట్టుకొని నిరసనలు తెలిపారు.. ఈ నిరసనల లో అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
