Rs.15 crore | డిగ్రీ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలి….

Rs.15 crore | డిగ్రీ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలి….

  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వినతి.

Rs.15 crore | పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పాయకాపురం ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజీని డిగ్రీ కాలేజీ వరకు అప్ గ్రేడ్ చేయాలి.రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇక్కడే మొదటిసారి ప్రవేశ పెట్టడం జరిగింది. సుమారు రూ.15కోట్ల వ్యయంతో అదనపు బిల్డింగ్ నిర్మాణం ఖర్చు చేయడం ద్వారా డిగ్రీ కాలేజి పూర్తి అవుతుంది. ఎందుకంటే అనేకమంది పేదలు, ఆటో కార్మికులు,తాపీ కూలీలు ఈ నియోజవర్గంలో ఉన్నారు.

ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు.ఆడపిల్లలు డిగ్రీ కాలేజీలో చదువుకోసం నగరంలోని వేరొక ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తున్నది.చాలా ఇబ్బందులు పడుతున్నారు.అలాగే ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులు ఆదుకోవడానికి, కాలేజీ చుట్టూతా ప్రహరీ గోడ,మిగిలిన వాటి నిమిత్తం మంత్రి లోకేష్ 20లక్షలు కేటాయించగా, సంవత్సరం పొడుగుతా ఆ గోడ నిర్మాణం జరిగి ఇటీవల పూర్తి చేశారు.ప్రక్కన బీసీ సంక్షేమ హాస్టల్ ఉంది.హాస్టల్కు కూడా నిధులు కేటాయించాలి.

అలాగే ఎస్.ఆర్.ఆర్.కాలేజీ అనగా టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ చదువుకున్న కాలేజీ అది. అందులో విద్యార్ధులకు హాస్టల్ వసతి కల్పించాలి.ఉపాధ్యాయులు కొరత, అదనపు తరగతులు కొరకు నిధులు మంజూరు చేయాలని మంత్రి, అసెంబ్లీ వేదికగా కోరడం జరిగింది.వెంటనే ఎస్.ఆర్.ఆర్. కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజీకి యుద్ధప్రాతిపదికన నిధులు కేటాయించాలి.

Leave a Reply