Organic | రెండవ రోజుకు చేరిన సుఫల రైతు యాత్ర

Organic | రెండవ రోజుకు చేరిన సుఫల రైతు యాత్ర
Organic | గన్నవరం – ఆంధ్రప్రభ : చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన సుఫల రైతు యాత్ర గురువారం రెండవ రోజుకు చేరింది. వీరవల్లి కృష్ణ మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో చినజీయర్ ముఖాముఖి నిర్వహించారు. మన నేల… మన ఆరోగ్యం.. భూ పరిరక్షణ… ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సేంద్రీయ పద్ధతుల ద్వారా జన ఆరోగ్య పరిరక్షణ ఈ కార్యక్రమం జరుగుతుందని స్వామీజీ తెలిపారు.
ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే రైతులకు సహరిస్తామని కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. జాతీయ పాడి రైతు అభివృద్ధి సంస్థ సహకారం అందిస్తామని తెలిపారు. చినజీయర్ స్వామి మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం అన్నారు. శ్వేత విప్లవంలో కృష్ణ మిల్క్ యూనియన్లో ఆదర్శంగా నిలిచిందన్నారు. మరో హరిత విప్లవం తీసుకురాబోతోందన్నారు. డెయిరీ.. ఆగ్రో కార్యక్రమాలు రెంటిని యూనియన్ సమ్మిళతంగా చేయబోతోందన్నారు.

మన ప్రాంతాల్లో పండిన పంటలకు సరైన ధర వచ్చేలా చేసే బాధ్యతను కృష్ణ మిల్క్ యూనియన్ వేసుకుంటుందన్నారు. ఇది ఇతరులకు ఆదర్శం కావాలన్నారు. ఎరువులు పురుగుల మందులు వాడకుండా పండిస్తాం అంటున్న రైతులకు మార్కెటింగ్ భరోసాను కృష్ణ మిల్క్ యూనియన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఇలాంటి భరోసా ప్రభుత్వాలు ఇవ్వాలని, కానీ వారికి ఉండే ఇబ్బంది వారికి ఉందన్నారు. పంట నాణ్యత ఆధారంగానే విలువ ఉంటుంది. మంచి ధర వస్తుందన్నారు. కృష్ణ జిల్లాలో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం ఇతర చోట్లకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సేంద్రీయ వ్యవసాయ సాగుదారులతో ప్రతిజ్ఞ చేయించారు.


click here to read more : Minister Lokesh | ఏపీకి పెట్టుబడులపై వైసీపీ కుట్ర..
