warning | విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

warning | విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ హెచ్చరిక
warning | ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో, ఫలితాల అనంతరం శుక్రవారం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. గెలిచిన అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు, క్యూ.ఆర్.టి టీంలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
జారీ చేసిన ముఖ్య సూచనలు:
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం పూర్తిగా నిషేధం. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు తావు లేదు. నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రిమాండ్‌లోకి పంపబడతారు. ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల అనుమతి తీసుకుని, వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే జరుపుకోవాలి. ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడుతూ ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
