NTR District | టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ..

NTR District | టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ..

  • నేడు ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ..
  • అంగరంగ వైభవంగా వేడుక
  • గురు నానక్ కాలనీలో ఎన్‌ఎసి కళ్యాణమండపంలో భారీ ఏర్పాట్లు..

NTR District, విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ నేడు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించనున్న ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశాయి. విజయవాడ నగరంలోని గురు నానక్ కాలనీలో ఉన్న ఎన్‌ఎసి కళ్యాణమండపంలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ప్రాంగణమంతా పార్టీ , పసుపు జెండాలతో అలంకరించి ఉత్సవ వాతావరణాన్ని సృష్టించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బోర్డు డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడం, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా సమస్యల పై ఉద్యమాత్మకంగా స్పందించడం వంటి అంశాల పై నూతన అధ్యక్షురాలు గద్దె అనురాధ ప్రసంగించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గద్దె అనురాధ నాయకత్వంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Reply