MLA | ఈ ఒక్కసారి కౌన్సిలర్‌గా గెలిపించండి…

MLA | ఈ ఒక్కసారి కౌన్సిలర్‌గా గెలిపించండి…
MLA | జనగామ, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలో 16 వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కల దేవి ఆకాంక్ష భార్గవ్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డు నుండి మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించాలని, వార్డు ప్రజల అభిప్రాయం మేరకు కౌన్సిలర్ గా బరిలో ఉన్నానని, ఒక్కసారి తనకు అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లకు విన్నవిస్తున్నారు.
ఈ ఒక్కసారి తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే.. వార్డును ఎమ్మెల్యే పల్లా సహాయ సహకారంతో 16 వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని హామీ ఇస్తున్నానని వెల్లడించారు…
